ప్రవల్లిక... తన కొత్త ఆఫీసులో!!!





ఆఫీసు బాయ్ ప్రవల్లికకు తన సీట్ చూపిస్తూ, మాడం ఇదే మీ సీట్ అని అంటాడు. థాంక్ you అని ఆమె అతనికి అంటుంది. ఆఫీసు బాయ్ అక్కడి నుంచి వెళ్లబోతుంటే, ప్రవల్లిక అతన్ని if you don’t mind మీ పేరేంటి అని అడిగింది. అప్పుడు అతను నా పేరు సిద్ధార్థ్ అని అంటాడు. ఆమె nice name అని అంటుంది, అప్పుడు అతను నవ్వుతూ అందరు నన్ను sid అని పిలుస్తారు, స్వీట్ గ షార్ట్ గ బావుంది కదండీ అని అంటాడు. ప్రవల్లిక నవ్వుతూ, ఆవును చాల బాగుంది, మీరు అన్నట్లు స్వీట్ మరియు షార్ట్ గ వుంది అని అంటుంది. అప్పుడు sid, సరే మాడం వుంటా, ఇక సెలవు అని అంటూ వెళ్ళిపోతాడు. ఆమె వెళ్లి తన సీట్లో కూర్చుంటుంది.


అక్కడ, తన next seat లో ఒక అమ్మాయి హడావిడిగా ఏదో వెతుకుతూ కనిపిస్తుంది. ప్రవల్లిక ఆమెను చూసి ఏంటి అంతలా వెతికేస్తోంది అని తను అనుకుంటూ, ఆ అమ్మాయిని, may I help you అని అడుగుతుంది. అప్పుడు ఆ అమ్మాయి, sure… నా సెల్ కనిపించటం లేదు అని అంటుంది. అప్పుడు ప్రవల్లిక ఓ నవ్వు నవ్వుతు… ఆమె వైపు నడుస్తుంది. అక్కడే వున్నా, తన CPU వైపు చూపించి, here it is అని అంటుంది. Oh… thank you soo much Missssss అని అంటుంది… Most welcome, my name is pravallika అని పరిచయం చేసుకుంటోంది. అప్పుడు ఆ అమ్మాయి very nice and rare name అని అంటూ myself Charitha అని అంటోంది. Thanks, nice meeting యు Charitha అని pravallika అంటోంది. Same here అని Charitha బదులిస్తుంది. Actually we have a meeting in a while, will talk to you later అని Charitha pravallika తో అంటోంది. సరే అని అంటూ pravallika తన సీట్లో వెళ్లి కూర్చుంటోంది.

తన కంప్యూటర్ ఆన్ చేసి అందులో వున్నా డేటా ని ఎక్సప్లోర్ చెయ్యటం మొదలెడుతుంది. కాసేపట్లో, Charitha హే ప్రవల్లిక, కాన్ఫరెన్స్ రూం లో మీటింగ్ వుంది వస్తావా అని అడుగుతుంది. అప్పుడు ప్రవల్లిక sure, I would love to join you అని అంటోంది. Charitha తో కలిసి కాన్ఫరెన్స్ రూం వైపు వెళ్తుంది. అంతలో Charitha సెల్ మోగుతుంది. Excuse me pravallika అని అంటూ కాల్ రిసీవ్ చేస్తుంది. Hey honey how are you ? అని అంటోంది. ఓహ్ sure, but right now am going for a meeting, will message you once done as to when we can meet అని అంటూ కాల్ కట్ చేస్తుంది.


ఆమె వైపే చూస్తున్న ప్రవల్లిక తో, its my boy friend, ఇవ్వాళ తన birthday, లంచ్ కి బయటకి వెళ్దాం అని అడిగాడు. ఏంటో ఈ రోజే మీటింగ్ కూడా వుంది. ఎన్నింటికి అయిపోతుందో తెలియట్లేదు. మీటింగ్ ఫినిష్ చేసుకొని లంచ్ కి వెళ్ళాలి అని అంటూ కాన్ఫరెన్స్ రూం చేరుకుంటారు. లోపలికి వెళ్తారు, కొందరు అప్పుడే వచ్చి తమ సీట్ లో కూర్చుని వుంటారు. ఇద్దరు వెళ్లి అక్కడే పక్క పక్కన వున్న కుర్చీల్లో కూర్చుంటారు. కాసేపట్లో అందరు వస్తారు. కొత్త మేనేజర్ గారు మరియు వర్మ గారు కూడా వస్తారు.

వర్మ గారు, sorry for the delay అని అంటూ, I take this opportunity తో introduce our new manager Mr. Revanth to you all అని అంటారు. రేవంత్ అందరిని హలో అంటూ గ్రీట్ చేస్తాడు. అందరు hello sir అని అంటారు. కానీ ప్రవల్లిక మాత్రం ఒక నవ్వు నవ్వుతుంది. దాన్ని రేవంత్ గమనిస్తాడు. కాని ఆమె వైపు చూసి, ఆహ పొద్దున్న బస్సు స్టాప్ లో చూసిన దేవత ఇప్పుడు నా కళ్ళెదుట వుంది, ఇది నిజమా, కలయా అని ఆలోచిస్తూ వుంటాడు. అంతలోనే వర్మ గారు, I would also like to introduce మిస్ Pravallika to you all అని అంటారు. She is our new technical writer అని పరిచయం చేస్తారు. ఆమె కూడా అందరిని హలో అంటూ గ్రీట్ చేస్తుంది. అందరు హలో అని అంటారు. రేవంత్ మాత్రం welcome to this office Miss Pravallika అని అంటాడు. ప్రవల్లిక లేచి థాంక్స్ అని చెప్పి తన సీట్ లోకూర్చుంటుంది. అంతలోనే కంపెనీ HR లేచి, అందరికి బహుశ తెలిసే వుంటుంది, ఇవ్వాళా ఆఫీసు లో వర్మ గారి ఆఖరి రోజు. So we have a small send off party అని అంటాడు. మాటల్లోనే sid లోపలి ఒక పెద్ద కేకుతో వస్తాడు. వర్మ గారిని కట్ చెయ్యమంటారు. కట్ చేసాక అందరికి పంచుతారు. అంతలోనే, HR It’s a small gift from all of us అని అంటూ ఒక పెద్ద gift pack వర్మ గారికి అందజేస్తారు. Thank you soo much అని వర్మ గారు అంటారు. కాసేపట్లో అందరు అక్కడ నుంచి దిస్పెర్సే అవుతారు. అందరు తమ తమ సీట్లోకి వెళ్ళిపోతారు. వర్మ గారు కూడా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళిపోతారు.

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

0 comments:

Post a Comment