ఓ వర్షం రోజు - బస్ స్టాప్ లో!!!


ఓ వర్షం రోజు, బస్ స్టాప్ లో ఓ అందమైన అమ్మాయి తన బస్ కోసం వేచి వుంది. తన గొడుగుతో మొహం కాస్త మూసి వుంది . ఆ అమ్మాయి తెలుపు రంగు కాటన్ చీర కట్టుకుని వుంది . పక్కనే వున్న ఒక అబ్బాయి, అమ్మాయి వొంపు సోంపు బావుంది, చూట్టానికి ఎలా వుందో చూద్దాం అని అనుకుంటూ మొహం చూట్టానికి ప్రయత్నిస్తాడు, కాని గొడుగుతో మొహం కాస్త కనిపించక పోతుంది. అప్పటికే ఆమెకు ఆఫీసుకీ టైం అయిపోయి వుంటుంది. వర్షం వల్ల ఎక్కువ ట్రాఫ్ఫిక్ వుండటంతో బస్ కూడా కాస్త లేట్ అయివుంతోంది అని అనుకుంటోంది.

అంతలో ఆ అమ్మాయి చేతిలో ఒక నవలు వుండటం పక్కన వున్న ఆ అబ్బాయి గమనిస్తాడు. దగ్గరికెళ్ళి అది ఏ నవలా అని తొంగి చుస్తే… అది యండమూరి గారి "వెన్నెల్లో ఆడపిల్ల". అతని మొహం కాస్త వెలుగుతుంది ఎందుకంటే అతనికి కూడా ఆ నవలు అంటే చచ్చేంత ఇష్టం. ఇద్దరి అభిరుచులు ఒకటేనని సంతోషిస్తాడు. అప్పటికే ఆలస్యం అయ్యింది అనుకుంటూ ఆ అమ్మాయి పర్స్ నుంచి సెల్ ఫోన్ తీసి ఒకరికి కాల్ చేస్తుంది. కాల్ కనెక్ట్ అవ్వగానే, "Hello this is pravallika sir. I would be getting late to the office due to the heavy rain", అని అంటూ ఎవరితో మాట్లాడుతుంది. "Its okay, I understand, take your time" అని అటు వైపు నుంచి ఆ వ్యక్తి అంటారు. ఆమె "thank you soo much sir" అని అంటూ కాల్ కట్ చేసి కాస్త రిలాక్స్ద గా ఫీల్ అవుతుంది. పక్కన వున్న ఆ అబ్బాయి ఇంకా సంతోషిస్తూ వుంటాడు. దీనికి రెండు కారణాలు… ఆ అబ్బాయి కీ అమ్మాయి పేరు తెగ నచ్చేస్తుంది, మరియు ఆ అమ్మాయి వాయస్ చాల బావుంటుంది.

అతనికి ఆ అమ్మాయి తో ఎలాగో అలా పరిచయం చేసుకోవాలన్న తపన. మొహం ఎలా వుంటుంది అని ఇంకో తపన . అక్కడే పక్కన వున్న, ఒక చెట్టు కింద, కళ్ళు లేని ఓక వ్రుద్దుడైన ఓ ముష్టివాడి వైపు ఆమె చూపు పడుతుంది. అతను వర్షంలో తడుస్తున్నది చూసు ఆమెకు జాలి వేసి అతని దగ్గరకి వెళ్లి తన చేతిలో వున్న ఆ గొడుగు అతనికి ఇచ్చి బస్ స్టాప్ వైపుకు తిరుగుతుంది. అప్పటికే, పక్కన వున్న ఆ అబ్బాయి, హమ్మయ, దేవుడు కరుణించాడు, ఆమె మొహం చూసేందుకు ఓక అవకాశం ఇచ్హాడు అని అనుకుంటాడు. అంతలో ఆమె దగ్గరకి వస్తుంది. తడిసి తడవని అందాలతో ఆమెను చూసి తను మై మరచి పోతాడు. ఆమె అందాన్ని పొగడటానికి ఎన్ని మాటలైనా చాలవు అని అనుకుంటాడు. అందమైన ఆ కళ్ళు, దొండపండులాంటి పెదవులు, ఆ ముక్కు, గాలిలో ఎగురుతున్న కురులు, ఇవన్ని చూసి… భ్రహ్మ చాల కష్టపడి చెక్కి వుంటాడు ఈ శిల్పాన్ని అని అనుకుంటూ…ఇక ఆలస్యం చేయకుండా ఆమెతో పరిచయం చేసుకోవాలి అని అనుకుంటూ వుంటాడు…

అంతలో ఆ అమ్మాయి వెళ్ళవలసిన బస్ వస్తుంది. హాడావిడిగా వెళ్ళేటప్పుడు తన నవలు నుంచి ఒక ఉత్తరం కింద పడిపోతుంది. ఆ అమ్మాయి దాన్ని గమనించుకోక అలాగే బస్ ఎక్కి వెళ్ళిపోతుంది. అది గమనించిన ఆ అబ్బాయి త్వరగా వెళ్లి ఆ ఉత్తరం తీసుకుంటాడు.

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

0 comments:

Post a Comment