ఆమె ఊహలో!!!

వర్షం పడటం వల్ల, ఆ ఉత్తరం కాస్త తడిసివుంటుంది. తన వద్ద వున్న బాగ్ లో ఆ ఉత్తరాన్ని పెట్టుకుంటాడు. బస్సు స్టాప్ లో తానొక్కడే వుండటం తో మెల్లగా ఆమె ఊహల్లో జారుకుంటాడు. అప్పుడే రెక్కలొచ్చిన పక్షిలా గాలిలో అనందం తో ఎగురుతూ , పాడుతూ వుంటాడు.

అంతలో అక్కడికి ఓ కార్ వచ్చి ఆగుతుంది. గొడుగు పట్టుకుని కార్ నుంచి డ్రైవర్ అతని వద్దకు పరుగెడుతూ “Sorry sir, ట్రాఫ్ఫిక్ వల్ల లేట్ అయ్యింది” అని అంటూ అతనికి గొడుగు పడుతూ కార్ వైపు వెళ్లి, కార్ డోర్ తెరిచి, అతను కూర్చున్నాక చేతిలోని గొడుగును మూసి, తను డ్రైవింగ్ సీట్ లో కూర్చుంటాడు. డ్రైవర్ కార్ ని ఆఫీసు వైపు డ్రైవ్ చేస్తాడు.

కార్ లో కూర్చున్న ఆ అబ్బాయి తన బాగ్ లోంచి ఆ ఉత్తరం బయటికి తీస్తాడు. లెటర్ తీయంగానే షాక్ లా ఫీల్ అవుతాడు, ఎందుకంటే అది వాళ్ళ కంపెనీ నుంచి ఆ అమ్మాయి కి వచ్చిన అపాయింట్మెంట్ లెటర్. లెటర్ మొత్తం చదివి, కింద సంతకం చేసిన వాళ్ళు ఎవరా అని చూస్తాడు. చుస్తే వర్మ గారి సంతకం. ఓ... ఓకే మన వర్మ గారు అపాయింట్ చేసిన కొత్త అమ్మాయి తనేనా అని తన మనసులో అనుకుంటాడు.

కార్ ఆఫీసు కి చేరుకుంటోంది. ఎంట్రన్స్ లోనే హడావిడిగా వర్మ గారు వచ్చి "welcome sir…" అని అంటూ అతన్ని స్వాగతిస్తారు. చేతిలోని బోకే ఇస్తారు. అంతలోనే ఆ డ్రైవర్ అతని వద్దకు వచ్చి , చేతిలోని బాగ్ తీసుకుని అతని కాబిన్ లో పెడతాడు.

అప్పుడు వర్మ గారు డ్రైవర్ తో... సర్ ని కనుక్కోవటం లో ఇబ్బంది కాలేదుగా అని అడిగారు. అస్సలు లేదు సర్...మీరు వారి ఫోటో ఇచ్చారుగా, సో ప్రాబ్లం లేకుండా కనుక్కో గలిగాను అని అంటాడు. ఫైన్ ఇక్కడ కాన్ఫరెన్స్ రూం లో ఇంకో అరగంటలో మీటింగ్ వుందని అందరికి కబురు పెట్టమని మన రిసెప్షనిస్ట్ తో కాస్త చెప్పి వెళ్ళు అని వర్మ గారు డ్రైవర్ తో అంటారు. డ్రైవర్ సరే సర్ అని అంటూ అక్కడ నుంచి సెలవు తీసుకుంటాడు.

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

0 comments:

Post a Comment